Unhealthy Foods: నేటి కాలంలో చాలా మంది బెల్లం, క్యాలరీలు తక్కువగా ఉండే చిరుతిళ్లు, చిరుధాన్యాలతో చేసే పదార్థాలను తీసుకుంటున్నారు. ఇవి ఆరోగ్యనికి మేలు చేస్తాయని భావించి తరుచు వీటిని తింటున్నారు. కానీ ఇవి తీసుకోవడం వల్ల పలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్కెట్ లో కొన్ని ర‌కాల బిస్కెట్లపై జీరో మైదా అనే ట్యాగ్ తో అమ్ముతున్నారు. కానీ దీనిని సరిగా గమనిస్తే ఈ బిస్కెట్ల‌ను మైదాపిండి, చ‌క్కెర‌ల‌తో త‌యారు చేస్తున్నారు. వీటిలో క్యాల‌రీలు కూడా అధికంగా ఉంటాయి. దీని కారణంగా అధిక షుగర్‌ లెవల్స్‌ పెరుగాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 


అంతేకాకుండా పాలల్లో ఉపయోగించే కొన్ని రకమైన పౌడర్స్‌ కూడా మార్కెట్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. దీని మీద విట‌మిన్స్, డిహెచ్ ఎ వంటివి చాలా త‌క్కువ శాతం ఉంటాయని పిల్లలకు ఇవి కలిపి ఇస్తుంటారు. కానీ వీటిలో ఎలాంటి విటమిన్స్‌ ఉండవని నిపుణులు తెలియజేస్తున్నారు.


చాలా బ్రౌన్ బ్రెడ్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియా మెరుగుపడుతుందని అపోహ పడుతుంటారు. దీని క‌లర్ చూసి మోస‌పోకూడ‌ద‌ని గోధుమ రంగు కేవ‌లం భ్ర‌మ‌ను క‌లిగించ‌డానికి మాత్రమే ఉప‌యోగిస్తార‌ని దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల ఫ‌లితం ఉండ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. 


Also read: Coconut Vinegar: కోకోనట్ వెనిగర్ గురించి విన్నారా, మధుమేహం వ్యాధిగ్రస్థులకు దివ్య ఔషధం ఇది


పాప్ కార్న్ ను చిన్న పిల్లల నుంచి పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.  ఈ పాప్ కార్న్ త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా ఉప్పు, బ‌ట‌ర్ ను ఉప‌యోగిస్తూ ఉంటారు. కాబటి కొనుగోలు చేయ‌డానికి ముందు ఇంట్లోనే త‌యారు చేసి తీసుకోవ‌డం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 


మార్కెట్ అనేక ర‌కాల పండ్లతో తయారు చేసిన  ర‌సాలు ప్యాక్ చేసి అమ్ముతుంటారు. దీనిలో నీ పంచ‌దార‌, ప్రిజ‌ర్వేటివ్స్  ఎక్కువ‌గా ఉంటాయ‌ని.  వీటిని తీసుకోక‌పోవ‌డ‌మే మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. 


పీన‌ట్ బ‌ట‌ర్ ను తింటూ ఉంటారు కొంతమంది. ఇందులో నూనెలు, పంచ‌దార ఎక్కువ‌గా ఉంటుంది. దీని తీసుకోవ‌డం వ‌ల్ల అధికంగా క్యాల‌రీలు శ‌రీరంలో వ‌చ్చి చేరుతాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


Also read: Cholesterol Control: ఎటువంటి కొవ్వునైనా సులభంగా కరిగించే టీ…తయారీ విధానం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి